CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్నిప్రమాదం లో పూర్తిగా ఇల్లు కాలిపోయి బాధిత కుటుంబాన్ని పరామర్శ.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండల పరిధిలో పూరేడుపల్లి గ్రామంలో సోమవారం చీమల బుచ్చయ్య ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులు గా మారారు.తిండి కోసం దాచుకున్న ధాన్యం కూడా పూర్తిగా కాలిపోయి బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ 50 కేజీ ల బియ్యం 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన బుచ్చయ్య కుటుంబం ఇల్లు మొత్తం పూర్తిగా అగ్నిప్రమాదానికి గురై తినడానికి ఉంచుకున్న వడ్లు కాలపోయి చెట్టుకింద ఉండి బోరుమని విలపిస్తుంటే వారి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయంగా బియ్యం నిత్యావసర సరుకులు అందించాల్సింది పోయి కనీసం ఇంతవరకు రెవిన్యూ అధికారులు ప్రమాదం జరిగిన వివరాలు కూడ తెలుసుకోలేదని రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం తీరుపై మండిపడ్డారు ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి బుచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు వంట సామగ్రి అందించి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లె జనార్దన్ మల్లూర్ శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ ముగులుట్ల సత్యనారాయణ జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగులు మీరా గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోరేం నర్సింహులు మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ మండల అధికార ప్రతినిధి దూళిపాల విజయ్ కుమార్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పులిశర్ల వెంకటేశ్వర్లు మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ పూరేడ్ పల్లి బూత్ అధ్యక్షుడు కోర్స నాగేష్ ప్రధాన కార్యదర్శి కొప్పుల నవీన్ శనగకుంట బూత్ అధ్యక్షుడు ఆక తిరుమల రావు శ్రీరాం వెంకన్న కుర్స ఆదినారాయణ కోర్స సాయికిరణ్ పొలం నవీన్ మలకం నర్శింహులు బేతాల వనరాజ్ ఇట్టబోయిన సంతోష్ కత్తి రాజు ముప్పిడి గణేష్ పెద్దల నరేష్ తోలెం నాగబాబు సిరికొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: