CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలి.--:మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు.

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం:టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల కరకగూడెం మండల స్థాయి సన్నాహక సమావేశం మండల అధ్యక్షులు రావుల సోమయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి స్టీరింగ్ కమిటీ సభ్యులు,మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నేతృత్వంలో హన్మంతుని గుడి లేని ఊరు లేదు,సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని అన్నారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపైననే ఉందన్నారు.ఎన్ని పథకాలు అమలు చేసిన ప్రజల్లోకి వెళ్లకుంటే పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ముఖ్యంగా కళ్యాణలక్ష్మి,షాధిముబారక్,ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత బంధు, గురుకులాల ద్వారా ఉచిత విద్య లాంటి పథకాలపై దృష్టి సారించాలని, అలాగే ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా నాయకులు సిద్ధం కావాలని సన్నాహాక సమావేశంలో సూచించారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు చురుకుగా పనిచేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్,ప్రభుత్వ విప్,భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశించారు.కావున పార్టీ బలోపేతానికి కృషి చేస్తే రానున్న రోజుల్లో నాయకులకు ఉన్నతమైన పదవులు ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా స్టీరింగ్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు కొల్లేటి భవానీ శంకర్, పినపాక నియోజకవర్గ ఆత్మ కమిటీ అధ్యక్షులు పటేల్ భద్రయ్య,సుబ్బారెడ్డి, వట్టం రాంబాబు,

మండల నాయకులు వెంకట్ రెడ్డి,పెద్ద రామలింగం,రామనాథం,నేతాజీ,పినపాక నియోజకవర్గ తెరాస యూత్ ప్రెసిడెంట్ మిట్టపల్లి సాగర్,కరకగూడెం మండల తెరాస యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మహిళ,ఎస్సీ,కార్మిక విభాగం అధ్యక్షుల్లు లావణ్య,ఏడుకొండలు,రాజేశ్వరావు, సర్పంచులు,ఎంపీటీసీలు,మండల నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షుల్లు,కార్యకర్తలు పెద్దఎత్తున తెరాస అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: