మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 12 :
ములుగు జిల్లా వాజేడు మండలం, టిఆర్ఎస్ పార్టీ నుండి బహిస్కారింప బడ్డ సోషల్ మీడియా ఇంచార్జి, జనగాం కేశవ రావు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఇటీవల ములుగు జిల్లా ఏటూరినాగారం బి ఎన్ అర్ పంక్షన్ హల్ లో జరిగిన సమీక్షా సమావేశం కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ లో చేరారు..కేశవ రావు,అర్ ఎస్ పి తో మాట్లాడుతూ అహర్నిశలు కస్టపడి ఒక అగ్రవర్ణ పార్టీ కోసం నా ఉజ్వలా నిస్వాసలు ప్రతి క్షణం పణం గా పెట్టి అద్భుతమైన సేవలు అందించిన కూడా ఎవరో ఏదో నా గురించి చెడుగా చెప్పారని నన్ను కనీసం మందలించకుండా ఏం జరిగింది, అని అడగకుండా నిర్ధాక్షణ్యంగా పార్టీ నుండి బహిష్కరణ సేసారు. అని కన్నీళ్లు కార్చారు.. వెంటనే స్పందించిన అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ధైర్యం కల్పిస్తూ అగ్రవర్ణ పార్టీ లు మనలను కేవలం ఓటర్ గా వాడుకొని అధికారం లోకి వచ్చాక పట్టించుకునే పరిస్థితి లేదు ఇక నుండి బి ఎస్ పి పార్టీ కోసం పని చెయ్ నీకు అండగా నేనున్నానని హామీ ఇచ్చారు. ప్రతి రోజు మీ ప్రాంతం లో ఏం జరుగుతుంది. అనేది తెలుసుకొని
నీ మీద ఎవరైనా దాడికి పాల్పడితే నా ద్రుష్టి కి తీసుకరమ్మని పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ధైర్యం కల్పించి పార్టీ లో చేర్చుకొని, జై బీం జై భారత్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబెడ్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. కాన్షిరాం సిద్ధాంతం పాటించాలి. అని నినాదలు సేసారు. ఈ కార్యక్రమం లో ములుగు & భద్రాచలం నియోజకవర్గం ల జిల్లా ల అధ్యక్షులు మండలం అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్టర్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ఓటర్లు, పెద్దలు, పిల్లలు, అర్ ఎస్ పి అభిమాములు, స్టూడెంట్స్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: