మన్యం టీవి న్యూస్:
ఫారెస్ట్ అధికారుల దాడులు బెదిరింపులు పోడు భూమి ఆక్రమణ ల కారణంగా ఆందోళనకు గురై పోడు సాగు రైతు ఏడి పలగూడెం గ్రామానికి చెందిన కుంజ రామయ్య మృతి చెందాడని ఆయన మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించి ఆయన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, మాజీ జెడ్పిటిసిచండ్ర అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .మంగళవారం ఆ పార్టీ స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పొడు భూమీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గత సంవత్సరం నవంబరు డిసెంబరు నెలల్లో అర్హులైన గిరిజన రైతుల నుంచి పోడు భూమి పట్టాల కొరకు దరఖాస్తులు స్వీకరించింది కానీ ఆ పట్టాలు సమస్యలు పరిష్కరించకుండా ఫారెస్ట్ అధికారులు, పోలీసులు,కలిసి పేదల భూములను బలవంతంగా లాక్కునే చర్యలకు పాల్పడుతోందని అందువల్ల అనేక మంది రైతులు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు భూములు కోల్పోయి నిర్వాసితులయ్యారు అని చాలామంది ఊళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని, అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజన ప్రజలు పాలకుల నిర్వాకం వల్ల అడవిలో నుంచి గెంటివేయబడు తున్నారని , వారికి కనీస జీవన భృతిని కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ జీవనం ఎలాఅని అర్థం కాక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గుండెపోటుతో మరణిస్తున్నారు అని,తప్పుడుకేసులు,వేదింపుల వల్ల గిరిజన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గిరిజన ప్రజలు సాగుచేసుకుంటున్న పోడు రైతుల సమస్య పరిష్కారం చేయకుంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో AIKMS రాష్ట్ర నాయకులు నాయిని రాజు, PDSU బద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ,AIKMS ఇల్లందు మండల అధ్యక్షులు బుర్ర వెంకన్న,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు,భూక్య శివ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: