CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సబ్ కా ఆవాజ్- సబ్ కా యోజనకు అభివృద్ధి ప్రణాళికలు.గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల లక్ష్యం.

Share it:

 


  • తునికాకు సేకరణ కలే దారులు పత్రాలను అటవీశాఖకు
  • సమర్పించాలి
  • గిరి వికాస్ పథకమును గిరిజన రైతులు వినియోగించుకోవాలి.
  • పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ

మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ఎంపీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీలలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి సబ్ కా ఆవాజ్ సబ్ కా యోజన కు అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి కార్యక్రమం ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పంచాయతీలలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించి ఆయా పంచాయతీల సర్పంచులు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా అంగన్వాడి సెంటర్ల మరమ్మతులు, ప్రాథమిక పాఠశాలల మరమ్మతులు, సిసి రోడ్ల ఏర్పాటుకు సంబంధించి భవిష్యత్తులో చేయబోయే ప్రణాళిక, మౌలిక సదుపాయాల గురించి తెలియజేయడం జరిగింది. ఏ ఏ పంచాయతీలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమో వివరించడం జరిగింది. ఈ సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలియజేశారు. దీనితోపాటు ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ 2015 నుండి 2020 వ సంవత్సరం లకు తునికాకు కలేదారులు, వారికి సంబంధించిన పత్రాలను స్థానిక అటవీశాఖ కార్యాలయంలో సమర్పించి, బోనస్ ను పొందవచ్చునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తునికాకు సేకరణ కలేదారులు వినియోగించుకోవాలని తెలియజేశారు. అనంతరం గిరి వికాస్ పథకం గురించి వివరిస్తూ, గిరిజన రైతులకు బోరుబావుల నిమిత్తం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక గిరిజన రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, వారి పంట పొలాలలో బోరింగ్ వేసుకునే సదుపాయాన్ని కల్పించుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతపంటి సత్యం, కాయం శేఖర్, వివిధ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: