మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలోని రాజపేట కేంద్రంగా గ్రామంలో ఎస్బిఐ బ్యాంకును తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జిల్లా నాయకులు టి రవి మడే రవి మాట్లాడుతూ మంగపేట మండలంలోని కమలాపురంలో ఎస్బిఐ బ్యాంకు ఉండడంతో మండల ప్రజలు కమలాపూర్ పోయి రావాలంటే అనేక ఇబ్బందులుపడుతూ ఒక రోజు పని వేతనం కోల్పోతున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు వాహనాలలో అధిక ఛార్జీలు పెట్టి మధ్య తరగతి ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోలేక పోతున్నారని అన్నారు.రాజపేట కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు రమణక్కపేట కత్తి గూడెం బ్రాహ్మణపల్లి దోమెడ నిమ్మ గూడెం రామచంద్రుని పేట వాడ గూడెం అకినేపల్లి మల్లారం పంచాయతీ పరిధిలోని 20 గ్రామాలకు పైగా ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోలేక పోతున్నారని తక్షణమే ప్రజల సౌకర్యం రాజుపేటలో ఎస్ బి ఐ బ్యాంకు తక్షణమే ఏర్పాటు చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు కేశవ్, మేరాజ్ ,వీరాజ్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: