CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సి ఎం హిమంత్ శర్మ ను వెంటనే ఆరెస్ట్ చేయాలి.అసోం సీఎం పై మంగపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:



మన్యం మనుగడ మంగపేట.

 కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై వెంటనే కేస్ నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగుజిల్లా కేంద్రంలో ని పోలీసుస్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలసి ఆమె మాట్లాడుతూ, అస్సాం ముఖ్య మంత్రి హిమంత ను కేంద్రం ప్రభుత్వం అతని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం స్పందిస్తుందనిభావించామని.. అయితే అలా జరగలేదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాతృమూర్తులపై చేసిన దాడి అని చెప్పారు.

గత రెండు రోజుల నుంచి బీజేపీ దుర్మార్గాలపై, అసోం సీఎంపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని... ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నేతలు హిమంతపై ఇస్తున్న ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకునేలా చూడాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ నుంచి స్పెషల్ పోలీస్ టీమ్ ను పంపి హిమంత శర్మను అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత సి.ఎం కేసీఆర్ పై ఉందని అన్నారు. న్యాయ నిపుణుల సలహాను తీసుకుని హిమంతను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి 48 గంటల సమయం ఇస్తున్నామని... చర్యలు తీసుకోకపోతే ఈ నెల మధ్యాహ్నం 16వ తేదీన కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లడి రాంరెడ్డి,

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,చెన్నోజు సూర్యనారాయణ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,

సర్పంచ్ లు గండి కుమార్,ఎండీ అహమ్మద్ పాషా,పసుల సాంబయ్య, చింత నిప్పుల భిక్షపతి, గందే శ్రీను, ఆర్షం రఘు,

యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి,మామిడి శెట్టి కోటి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: