మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పినపాక మండలం లోని టిఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ లు పంచిపెట్టారు. పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పినపాక లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంచి పెట్టడం జరిగింది. అదేవిధంగా జానంపేట పంచాయతీ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య ఆధ్వర్యంలో జానంపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండ్లు, బ్రెడ్ లు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పినపాక, జానంపేట వైద్యాధికారులు శివ కుమార్, శృతి, పినపాక మండల టిఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: