- తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ఎన్ఆర్ఐ రూ 25 వేలు ఆర్థిక సహాయం.
- జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖరశర్మ.
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : నేటి సమాజంలో అందరూ బాగుండాలి అందులో మనంఉండాలనే ఉన్నత లక్ష్యంతో అభాగ్యులకు అండగా నిలవడం మంచి మనసుకు నిదర్శనమని జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖరశర్మ అన్నారు. శనివారం తిప్పనపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు అంచ ఉషారాణి,సాయివైష్ణవి చిన్నారులకు ఎన్ఆర్ఐ జరుగుల శ్రీనివాసరావు (అమెరికా) రూ 25వేలు ఆర్థిక సహాయాన్ని డిఈఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ఖండంతరాలు అవతల ఉన్న శ్రీనివాసరావు స్పందించి ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. చిన్నారుల ఉన్నత చదువులు ఎంత వరకు చదివితే అంతవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా యుపిఎస్ తిప్పనపల్లి ఉపాధ్యాయులు సైతం రూ 5వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తొలుత చిన్నారుల తల్లిదండ్రులు ఆంచ కోటేశ్వరి(39) అంచ అప్పారావు (42) ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు,తాళ్లూరి వెంకటేశ్వరరావు ఎంఈఓ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు సుజాత, పిఆర్ టియు జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రవి,పిఆర్ టియు నాయకులు ఆరిఫ్, జయకర్, రాములు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్గా,గాదె లింగయ్య,ఉపసర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షులు లగడపాటి రమేష్, లంక నరసింహారావు,గూగులోత్ రమేష్, పసుపులేటి మంగయ్య, వేల్పుల లింగయ్య, ఎస్ భాస్కర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: