గుండాల /ఆళ్లపల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) పేదల అభ్యున్నతికి పనిచేసే ఒకే ఒక్క ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం ఆల పల్లి మండల కేంద్రంలో 3 కోట్లతో నిర్మించిన అరవై రెండు పడకల సముదాయాలను ప్రారంభించి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు లక్షల రూపాయలు వెచ్చించి నిరుపేదల కోసం రెండు పడకల సముదాయాలను నిర్వహించామన్నారు. త్వరలోనే సొంతంగా భూమి ఉన్నవారికి రెండు పడకల గుర్రాలను కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, తాసిల్దార్ రజియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, కోపరేటివ్ చైర్మన్ రామయ్య , టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రజా ప్రతినిధులు అధికారులు లు పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: