మన్యం వెబ్ డెస్క్:
ఇల్లందు ఎస్సీ బాలికల వసతి గృహానికి మరియు గుండాల బాలుర వసతి గృహానికి పర్మినెంట్ వార్డెన్ లు లేకపోవడంతో ఇంచార్జి పాలన కొనసాగడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే పర్మినెంటు వార్డెన్ లను నియమించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా, పి డి యస్ యూ బద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ పి డి యస్ యూ జిల్లా అధ్యక్షులు సాంబ డిమాండ్ చేశారు. ఈరోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో షెడ్యూల్ కులాల జిల్లా అధికారి అనసూయ గార్కి పి డి యస్ యూ, ఏఐఎస్ఎఫ్,పి డి యస్ యూ విద్యార్థి సంఘ నేతలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మూసివేసిన విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంలో వసతిగృహాల లోని విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన వార్డెన్ లు అదనపు బాధ్యతలు మూలంగా ఇన్చార్జి వసతి గృహాలను వదిలేశారని వారి పర్మినెంటు వసతిగృహాల కే ఎక్కువ టైం కేటాయించడం వలన ఇన్చార్జి వసతి గృహాలకు వెళ్లే పరిస్థితి లేదని దీనిమూలంగా విద్యార్థులకు సక్రమంగా మేము అందకపోవడం వారి ఆలనాపాలనా చూడండి శ్రద్ధ చూపించక పోవడంతో వసతి గృహంలోని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి దృష్టికి తీసుకువచ్చారు.కరోనా సమయంలో విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన బాధ్యత వార్డెన్ లకు ఉంటుందని వారు గుర్తు చేశారు. అదేవిధంగా ఇల్లందులో షెడ్యూల్ తెగల వసతిగృహాల వార్డెన్ కు ఇన్ చార్జ్ ఇవ్వడం మూలంగా వారి పర్మినెంటు వసతి గృహాల నుండి తీసుకువచ్చిన పర్చేజ్(కిరాణం సామాండ్లు)ను ఇంచార్జి వసతి గృహాల విద్యార్థులకు సర్దుబాటు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని తక్షణమే దీనిపై పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ఇల్లందు గుండాల వసతి గృహాలకు పర్మినెంట్ వార్డు నియమించాలని వారు డిమాండ్ చేశారు.
Post A Comment: