అశ్వాపురం ప్రతినిధి,
(మన్యం మనుగడ);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఆదివాసీలు మండలస్థాయి నూతనఆదివాసీ భవనం నిర్మిస్తున్నారు దీనిలో భాగంగా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సీనియర్ నాయకులు తంగేళ్ల భద్రయ్య అధ్యక్షతన ఇటుక బట్టీల యాజమాన్యం సభ్యులను కలవడం కరపత్రాలు పంచి నూతన భవనం ముఖ్య ఉదేశ్యం వివరించగా వారు కూడా సానుకూలంగా స్పందించి నూతన భవనం నిర్మాణంలో కావలసిన పూర్తిస్థాయిలో ఇటుకలు మావంతు సహాయంగా అందిస్తామని అధ్యక్షులు మర్రి మల్లారెడ్డి. తలపనేని కొండలరావు బద్దం వెంకటరెడ్డి నర్సిరెడ్డి గుర్రం రవి జె.ఏ.సి కమిటీకి హామీ ఇచ్చినారు. ఈ సమావేశంలో ఆదివాసీ సీనియర్ నాయకుడు తంగేళ్ల భద్రయ్య నూతన అధ్యక్షుడు పోడియం అనిల్ ప్రధాన కార్యదర్శి కుంజా రామారావు చాప ముత్తయ్య కోరేం రామారావు కల్లూరి నరసింహ రావు పాల్గొన్నారు.
Post A Comment: