CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డా :అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఊపసంహరించుకోవాలి--తాటి కృష్ణ

Share it:

 


             

మన్యం మనుగడ మంగపేట 

రాజ్యాంగాన్ని మార్చాలంటూ భారత రాజ్యాంగ నిర్మాత డా :అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు కల్తీ రామకృష్ణ ఆధ్వర్యంలో కమలపూర్ లోని అంబేద్కర్ సెంటర్లో అంబెడ్కర్ విగ్రహానికి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ మరియు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు జబ్బ సమ్మయ్య అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబెడ్కర్ కు పూలమాలలువేశారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ

అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ (3) ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాజ్యాంగం వల్లనే మీ కుటుంబం మొత్తం పదవులు అనుభవిస్తు  

రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుల అహంకారంతో అంబేద్కర్ ను అవమానించడం సహించరాని విషయం.ప్రపంచానికి ఆదర్శవంతమైన ప్రజా స్వామ్యాన్ని అందించిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటావా? ఎంత అహంభావం?

కేసీఆర్ గిరిజన దళిత బీసీ మైనార్టీలకు వ్యతిరేఖి అందుకే, అంబేద్కర్ జయంతి, వర్దంతికి రాలేదు. అంబేద్కర్ 125 అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దళితులకు 03ఎకరాల భూమి ఉట్టి ముచ్చట అయ్యింది, డబల్ బెడ్ రూమ్ పడకేసింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయని దళిత బంధు అన్నాడు కానీ అది బంద్.రాష్ట్రపతి కోవింద్ ఒక దళితుడు కాబట్టి అతని ప్రసంగించిన ఆయన ప్రసంగాన్ని బహిష్కరించాలని ఎంపీలను ఆదేశించాడు ప్రపంచంలోనే అతిపెద్ద, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. అమెరికా, బ్రిటన్ యావత్తు దేశాలన్ని ఈ స్థాయిలో రాజ్యాంగం ఎక్కడ కూడా లేదు అని కొనియాడతుంటే,మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగాన్ని మార్చాలని ఆయనలో ఉన్న రాచరిక నిజాం నవాబు, మొగల్ తలపిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ ను వదలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందిరాగాంధీ కూడా రాజ్యాంగ మౌళిక సూత్రాలను మార్చాలనుకుని భంగపడి ఘోర పరాజయం పాలైంది నరేంద్రమోదీ పార్లమెంట్ కు వచ్చిన తరువాత ‘‘నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నా,ఈ ప్రధాని పదవి అంబేద్కర్ పెట్టిన భిక్ష,అంబేద్కర్ లేనిది నేను లేను అని చెప్పిన గొప్ప వ్యక్తి మోదీ.

మీరు ఏకంగా రాజ్యాంగాన్ని మారుస్తానని ఏకంగా అంబేద్కర్ నే అవమానించిన ఘనత 

కేసీఆర్ మీదే..రాజ్యాంగంతో ఆటలాడాలనుకుంటవా?... రాజ్యాంగాన్ని ముట్టుకుంటే అగ్గి అయి పోతవ్ కేసీఆర్. ఇప్పటికైనా తన తప్పును తెలుసుకోని బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేదంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో మీరు ఎక్కడికి వెళ్లిన క్షమాపణలు చెప్పేవరకు అడుగు అడుగునా అడ్డుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి జిల్లా కార్యదర్శి పొదేం రవీందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు రామిడి సురేష్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోరేం నర్శింహులు గిరిజన మోర్చా జిల్లా కోశాధికారి కోరేం నారాయణ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తెబోయిన నర్సింహారావు యువ మోర్చా జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి గిరిజన మోర్చా వనబందు జిల్లా కన్వీనర్ భూక్య రతన్ సింగ్ కిసాన్ దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతేన పల్లి నరేందర్ రామాటేంకి సమ్మయ్య కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పులిశర్ల వేంకటేశ్వర్లు మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు షేక్ ఆమ్రోజ్ ఖాన్ జిల్లా నాయకులు మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు అబ్బెరబోయిన లక్ష్మన్ దళిత మోర్చా మండల అధ్యక్షప్రధాన కార్యదర్శి లు దుర్గం నర్సింహారావు బంటు విశ్వనాధం ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కోటనాల కుమార్ సీనియర్ నాయకులు ఎంగన్న ఈక రాజేష్ పోలేబొయిన కేశవరావు లోడిగే మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: