టేకులపల్లి ఫిబ్రవరి 13 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని బద్దుతండ గ్రామ పంచాయతీ, నంద్యాతండ గ్రామంలో సర్పంచ్ భూక్య చిన్ని అధ్యక్షతన జరిగిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, టియస్.టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతం నంద్యాతండ నుండి పేద గిరిజన విద్యార్థులు బాదావత్ నితిన్,బాదావత్ పుష్పలత కు ప్రభుత్వ కళాశాలలో రెండు యం.బి.బి.యస్ సీట్లు ఐఐటి,యన్ఐటి లలో ఇంజినీరింగ్ సీట్లు రావడం మన గ్రామానికి,టేకులపల్లి మండలానికే గర్వకారణం అన్నారు.ఎలాంటి ఖర్చు లేకుండ లక్షల రూపాయలు పెట్టిన దొరకని సీట్లు ఇలాంటి కళాశాలలో సీట్లు సంపాదించుకున్నారు.అదే విధంగా కటిక పేదరికం నుండి వచ్చిన గుగులోత్ మోతిలాల్ కు ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ గా,బాదావత్ నవీన్ కు కోల్ ఇండియా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు రావడం అంటే మామూలు విషయం కాదన్నారు.దీనికి బట్టి చూస్తే చదువు ముందు పేదరికం బానిసే అన్నారు.ఈ పిల్లలను అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి వారిని అభినందించారు.ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భూక్య పరశురామ్ ని కూడ అభినందించారు.తదనంతరం విద్యార్థులను,వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాలోత్ రాజేందర్ సర్పంచ్,పూల్ సింగ్,హర్జ్య నాయక్,ఖీర్యా నాయక్,శంకర్,అశోక్ చౌహన్,కిరణ్,రత్నా,హరిలాల్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: