CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు హర్షణీయం.

Share it:  • నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణ...
  •  బాల వెలుగు హెచ్ఎం జగన్మోహన్ రెడ్డి....

మన్యం మనుగడ మంగపేట.

స్వర్గీయ నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు చిరస్మరణీయం మరియు హర్షణీయమని బాల వెలుగు ప్రత్యేక విద్యా శిక్షణ కేంద్రం ప్రధానోపాధ్యాయులు బి జగన్మోహన్ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన మణుగూరు హీరో షోరూం యజమాని విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు నాసి రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా మణుగూరు పట్టణంలోని బాల వెలుగు ప్రత్యేక విద్యా శిక్షణ కేంద్రం లో నిరుపేద అనాధ విద్యార్థుల మధ్య పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల వెలుగు ప్రత్యేక విద్యా శిక్షణ కేంద్రం ప్రధాన ఉపాధ్యాయులు బి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ వినయ్ కుమార్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా తమ బాలవెలుగు ప్రత్యేక విద్యా శిక్షణ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తో పాటు రూపాయలు పదిహేను వెయిలు విలువైన డిజిటల్ సౌండ్ సిస్టం బహుకరించడం హర్షణీయమన్నారు వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు వినయ్ కుమార్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తన తనయుడిని కోల్పోయి సంవత్సరం పూర్తి ఐయి ఈరోజు ప్రధమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ తొలి వర్ధంతి కార్యక్రమాన్ని అనాధ పిల్లల మధ్య జరుపుకోవడం తనకి బాధలోనూ సంతోషం కలిగిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటరమణ భార్గవ్ రెడ్డి సాని కొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి బజాజ్ షోరూం యజమాని కుర్రి నరసింహారావు డాక్టర్ అప్పారావు కోటేశ్వరి క్రాంతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: