మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లోని బుదవారం అశ్వారావుపేట రైతు వేదిక వద్ద పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు అశ్వారావుపేట, దమ్మపేట మండల ప్రజా ప్రతినిధులతో మండలంలోని అన్ని గ్రామ సర్పంచ్ లతో మాదక ద్రవ్యం (డ్రగ్స్) నిర్మూలనకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ వారితో సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లీ శ్రీరామమూర్తి, దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వర రావు, దమ్మపేట వైస్ ఎంపీపీ ధార మల్లికార్జున్ మరియు సర్పంచులు ఎంపీటీసీలు, అశ్వారావుపేట సీఐ ఉపేంద్రరావు, అశ్వారావుపేట ఎస్ఐ చల్ల అరుణ, దమ్మపేట ఎస్సై శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: