CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమ్మక్క-సారలమ్మ లు పోరాటయోధులు.మేడారం సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Share it:

 



ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ను ఆదివారం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ -వసుమతి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ వారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మేడారం దేవాదాయ కమిటీ చైర్మన్ శివయ్య మర్యాదపూర్వకంగా నారాయణ ను కలిసి తల్లుల బంగారంను అందజేశారు. సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకొనే సమయంలో పలు శాఖల అధికారులు . భక్తులు జాతీయ కార్యదర్శి నారాయణను పలకరించి ఆయనతో సెల్ఫీ ఫోటోలు దిగారు. వీరవనితల జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తల్లులను దర్శించుకోవడం జరుగుతుందని, సమ్మక్క సారక్క మేడారం జాతర ను జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా నారాయణ అన్నారు. జాతరలో శాశ్వతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. సమ్మక్క-సారలమ్మ లు దేవతలు కారని, పోరాట యోధులు అని,ప్రజా పోరాటాలకు స్పూర్తి ప్రధాతలని, అందువల్లనే తాము సందర్శించేందుకు వచ్చామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో నారాయణ వెంట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు. సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ రావు, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కె. రాజ్ కుమార్,ఏ ఐటియుసి నాయకులు కొండయ్య ,సిపిఐ హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట బిక్షపతి,జిల్లా నాయకులు ఎం. హరికృష్ణ,ఎండి ఉస్మాన్ పాషా,మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకులు డాక్టర్ అరుణ, కొరిమి సుగుణ,ఎటురూనాగారం మండల కార్యదర్శి ఎండి నాసర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: