గుండాల ఫిబ్రవరి1 (మన్యం మనుగడ) రైతులు మేకలు, గొర్రెలకు తప్పనిసరిగా పి పి ఆర్ టీకాలు వేయించాలని వెటర్నరీ అసిస్టెంట్ బి హరి కిరణ్ సూచించారు. చెట్టు పల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులు వాటికి వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ వ్యాధి వల్ల మేకలకు ,గొర్రెలకు నోటి పై, పెదాలపై, ముక్కుపై పొక్కులు అవుతాయని జ్వరం వస్తుందని అన్నారు. వెంటనే గుర్తించడంతో వాటిని ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని సూచించారు. మేకలు గొర్రెలు ఉన్న రైతులు పీకాకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, పశు వైద్య సిబ్బంది రాము, రైతులు పాల్గొన్నారు
Post A Comment: