మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం లో ఆదివాసీ గిరిజన వనదేవతలు గా పేరుగాంచిన సమ్మక్క సారక్క జాతర 9 వ తారీకున ప్రారంభమైన విషయం పాఠకులకు విధితమే, ఆదివాసీ గిరిజన సంప్రదాయం లో వనదేవతలను మేళతాళాల నడుమ భక్తజనసందోహంతో గద్దెల పైన ప్రతిష్ఠించ గా, దూర ప్రాంతాల ప్రజలు మరియు పరిసర ప్రాంత భక్తులు భక్తిశ్రద్ధలతోటి తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. ఈ ఆదివాసి వనదేవతలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సతీమణి నందిని, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య, స్థానిక ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారావు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు వీరభద్రం, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండేలా చూడాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కాగా 11 వ తారీకు భక్తుల దర్శనం అనంతరం తిరిగి నేడు వన ప్రవేశం తో జాతర ముగియ నున్నట్లు జాతర నిర్వహణ కమిటీ తెలిపారు.
Post A Comment: