CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి జూజ్జురపు వెంకన్న ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ జూపల్లి రమేష్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రధాని నరేంద్రమోదీ అవకాశం లభించిన ప్రతిసారీ అక్కసు వెళ్లగక్కుతున్నారని, సంక్షేమ పథకాల అమలులో దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ వేరుపడి బాగుపడిన తీరును చూసి ప్రధాని మోదీ ఆవేదన చెందుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణకు భాజపా,కాంగ్రెస్‌ రెండూ అన్యాయం చేశాయని,ఆ పార్టీల వైఖరితో వేల మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ అభివృద్ధి అడ్డుకోవడానికి చూస్తుందని దానిలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అక్కసును వెళ్లగక్కారని, వెంటనే మోడీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. మండల వ్యాప్తంగా నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధానమంత్రి కేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మోడీపై బిజెపి ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు,సెక్రెటరీ జూజ్జురి వెంకన్నబాబు,ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు జూపల్లి రమేష్, రైతు సొసైటీ జిల్లా సభ్యు నిర్మల పుల్లారావు, రైతు సొసైటీ మండల చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ చెన్నంశెట్టి సత్యనారాయణ, సర్పంచ్ అట్టంరమ్య, ఉప సర్పంచ్ కేదార్నాథ్, గ్రామ కమిటీ అధ్యక్షులు సంపూర్ణ, చిన్నారావు, బజారయ్య, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, షేక్ ముబారక్ కోటగిరి సీతారామస్వామి, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి రమణ రావు, చిన్నంశెట్టి నరసింహారావు, నండ్రు రమేష్, కలపాల శ్రీనివాసరావు, మోటూరి మోహన్, అల్లాడి రామారావు తదితర నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: