మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: అశ్వాపురం మండలం వెంకటాపురం గ్రామం లో గిరిజన రైతు ల పోడు భూములలో కందకాలు తవ్వ తున్న ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజన రైతులు. గత రెండు రోజుల క్రితం ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఫారెస్ట్ అధికారులకు మీటింగ్ పెట్టి కంధకాలు తీయ్యెద్దు గిరిజన రైతు లను ఇబ్బందులు పెట్టవద్దు వారికీ ప్రభుత్వం పట్టాలు ఇస్తది అని చెప్పిన వినకుండా అత్యుస్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్నో ఏళ్ళ క్రితమే పోడు చేసి వ్యవసాయం చేసుకునే వారి భూములను హరితహారం పేరుతో కందకాలు తీయడం సరికాదని పోడు రైతులు కందకాలు తీసే జెసిబి ని అడ్డుకున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ సీఎం కేసీఆర్, పినపాక శాసనసభ్యులు మాట ఇచ్చారు. అటవీ అధికారులు తీరుపై పోడు సాగుదారులు మండిపడ్డారు, ఇక నుండి ఆదివాసుల పై అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడితే మంచి పనులు ప్రారంభిస్తే ఇక ఉద్యమం తప్పదని పోడు రైతులు అటవీశాఖ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ పంచాయతీ పోడు రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: