మన్యం మనుగడ మంగపేట.
ప్రపంచ దేశాలన్నింటిలో కెల్లా వినూత్నమైన,విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించి, ప్రతి పౌరుడు సమానమని చాటిచెప్పే భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనడం ముమ్మాటికీ చారిత్రక తప్పిదం. భారతదేశ చరిత్రలో మనువాదం మరియు బహుజన వాదం ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఎన్నాళ్ళ కైనా బహుజనుల అంతా ఏకమైతే, ఆధిపత్య కులాల ఆటలు సాగవని భారత రాజ్యాంగంపై ఆధిపత్య కులాలు ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తూ బహుజనుల హక్కులను, స్వేచ్ఛను కాల రాయడానికే ఈ ప్రభుత్వాలు పూనుకున్నట్లు కనిపిస్తున్నాయి. భారత దేశంలోని ప్రతి పౌరుడికి సమానమైన హక్కు కల్పించిన భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ ములుగు జిల్లా కమిటీ పూర్తిగా ఖండిస్తుంది. అంబేద్కర్ ఆనవాళ్లు భారతదేశం లో లేకుండా చేసి బహుజన వాదాన్ని దేశంలో లేకుండా చేయాలనే కుట్రలు తిప్పి కొట్టాల్సిన అవసరం బహుజనుల పై ఎంతైనా ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలి అని అనడం ముమ్మాటికీ అది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించినట్లే అవుతుంది. ఈ రాష్ట్ర గౌరవ ప్రద స్థానం లో ఉన్న ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం మార్చాలి అన్నాడు అంటే ప్రజాస్వామ్యంనుభారత దేశాన్ని అపహాస్యం చేసినట్లే అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా గా, లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. కొత్త పార్లమెంట్ అంటూ కొత్త రాజ్యాంగం అంటూ బహుజన ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేస్తున్న రాజకీయ పార్టీల అంతు చూడాలని బహుజన సమాజం అంతా ఏకమై మనువాద పార్టీల భరతం పట్టాలని దేశంలో బీజేపీని రాష్ట్రంలో టిఆర్ఎస్ ని గద్దె దింపి బహుజన రాజ్యాన్ని స్థాపించాలని ములుగు జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ కి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి సమాజానికి దేశ రక్షణ కొరకు చెప్పాలని శాంతి యుత నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి లు మైస సతీష్, శనిగరపు నరేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు పరికి పవన్ తేజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ సంఘటన మంత్రి ఎంపెల్లి వీర స్వామి జిల్లా కోశాధికారి బోట్ల కార్తీక్, జిల్లా ఈసీ మెంబెర్ కాలువ నరేష్ అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ సురేష్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కర్నె రమేష్ జిల్లా బీవీఇఫ్ కన్వీనర్ మణికంత్ ముదిరాజ్, బీఎస్పీ నాయకులు స్టాలిన్, బుర్రి దేవేందర్, జన్ను శ్రీకాంత్, నునిగంటి చంద్రమౌళి, వేణు స్వేరో, మోక్ష, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: