- జూలూరుపాడ్ లో శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య.
- ఖమ్మం జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులు ,ఎమ్మెల్సీ తాతా మధు
- అధిక సంఖ్యలో హాజరైన అభిమానులు
- భారీ కార్ల ర్యాలీ
మన్యం టీవి న్యూస్:సీఎం కేసీఆర్ వదిలిన బాణం విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తొలి సారి భద్రాద్రి జిల్లా కు విచ్చేస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా సరిహద్దు మండలం జూలూరుపాడ్ మండలం వినోభా నగర్ వద్ద టీఆరెస్ పార్టీ శ్రేణులు, రేగా అభిమానులు కోయ, లాంబడ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులు ,ఎమ్మెల్సీ తాతా మధు ,జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, బొకే అందజేసి రేగా కాంతారావు కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అన్ని మండలాల టీఆరెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Post A Comment: