మన్యం మనుగడ మంగపేట.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసిఆర్ అవహేళన చేస్తూ మాట్లాడడడం సిగ్గుచేటు
దేశ ప్రజలకు కెసిఆర్ క్షమాపణలు చెప్పాలి.
రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి ఒక్క నిముషం కూడా సీఎం కుర్చీలో కూర్చోవటానికి అర్హుడు కాడు.
బుధవారం మంగపేట మండల రాజుపేట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడిన కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ ఆధ్వర్యములో రాజుపేట లోని అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబెడ్కర్ విగ్రహం ముందు ధర్నా, రాస్తరోకో చేసి కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ములుగు జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు ఈ సందర్బంగామాట్లాడుతూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా డా: అంబెడ్కర్ చిత్రపటం తప్పని సరి గా ఉండాలి అంబేద్కర్ భారత జాతికి ఆదర్శం అని నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి అని అనడం సిగ్గుచేటు.
.భారత రాజ్యాంగం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నియంతృత్వ పాలనను ప్రజలు అందరూ గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే వారికి బుద్ధి చెపుతారని దేశ ప్రజలకు భహిరంగగా క్షజామాపన చెప్పాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్ ప్రధాన కార్యదర్శులు చెట్టుపల్లి ముకుందాం, బాడిశ ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు కుర్సం రమేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెలా సుధీర్,రాజుపేట గ్రామ యూత్ కాంగ్రెస్బ్అధ్యక్షలు కరకపల్లి సాంబమూర్తి,యూత్ నాయకులు అక్కినేపల్లిమల్లారం గ్రామ అధ్యక్షులు షేక్ మైనుద్దీన్,యూత్ నాయకులు కొమురం సందీప్, కర్రీ చందు,బెత శ్రీను,ఎర్ర శ్రావణ్,ఎండి ఫయాజ్,కట్ల శివ రాజు,భాను చందర్,లక్కీ ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: