మన్యం మనుగడ, పినపాక:
కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేసిన తరువాత, ఫిబ్రవరి 1 నుండి పాఠశాలలు ప్రారంభించాలని, అదే రోజున పాఠశాలలో పింకు కలర్ లో ఉన్న బెలూన్లను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించి నందున, తెలంగాణ ప్రభుత్వం విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో పినపాక మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బెలూన్ లు ఎగరవేయడం జరిగింది. కొన్ని పాఠశాలలకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులతో కలిసి బెలూన్లు ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఎంపీటీసీ చింతపంటి సత్యం, వివిధ పంచాయతీల సర్పంచులు, పినపాక మండల ఎంఈవో వీరస్వామి, ప్రజలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: