CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారత రాజ్యాంగాన్నిమార్చాలి అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి---:యస్ సి సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

విశ్వ విజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 03 ప్రకారం చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని వ్రాయడం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించాము అని చెప్పిన తెలంగాణా రాష్ట్ర మొదటి శాసన సభలో ప్రకటించిన సీఎం కెసిఆర్ ఆనాడు భారత రాజ్యాగం పై ప్రమాణం చేసి అంబేడ్కర్ ను కీర్తించాడు. తెలంగాణా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని బహిరంగ వాగ్దానం చేసి, మోసగించి రాష్ట్రానికి సీఎం ఐన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు 7 సంవత్సరాలు రాష్ట్ర సీఎంగా పరిపాలించిన అధికార గర్వంతో అన్నం పెట్టిన రాజ్యాంగానికి సున్నం పెట్టాలని చూస్తున్న కెసిఆర్ వెంటనే భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టి జిల్లా యస్సి సెల్ అద్యక్షులు దాసరి సుదాకర్, మంగపేట మండల అద్యక్షులు మైలా జైరామ్ రెడ్డి అదేశాల మెరకు యస్సి సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో 34 డిగ్రీలు సాధించి, 06 పిహెచ్డీలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలి అనడం కేంద్రంలోని మనువాద బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అహంకార టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న లోపాయకారి సంబంధాన్ని, ఒప్పందాన్ని తనకు తానుగా సీఎం కెసిఆర్ బయటపెట్టు కున్నాడని వెంటనే భారతదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్న రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ప్రజా ప్రతినిధులుషెడ్యూల్ తరగతులు, బహుజన వాదులు శాంతియుతంగా, బహిరంగంగా 

నిరసన కార్యక్రమాలు చేపట్టి సీఎం కెసిఆర్ రాజ్యాంగం పై పలికిన తప్పుడు మాటలు వెనుకకు తీసుకునేలా ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను ఆందోళన రూపంలో తెలియజేయాలనీ పిలుపు ఇవ్వడమైనది.

భారత రాజ్యాంగ పట్ల అగౌరవంగా మాట్లాడిన కెసిఆర్ పై రాష్ట్రపతి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో మండల యస్సి సెల్ అద్యక్షులు పల్లికొండ యాదగిరి, యస్టి సెల్ మండల అద్యక్షులు చాద మల్లయ్య, బిసి సెల్ మండల అద్యక్షులు ముత్తినేని అధి, మండల ఉపాద్యక్షులు తుడి భాగవాన్ రెడ్డి, జిల్లా నాయకుల్ జాడి రాంబాబు, మండల యస్ సి సెల్ కార్యదర్శి జంగం భాను చందర్ మండల మిడియ ఇంచార్జ్ బసారి నాగార్జున, కన్నాయిగూడెం మాండల్ యస్ సి సెల్ ప్రధానకార్యదర్శి అంబాల సమ్మయ్య, అల్లెo నర్సింహారావు, మండల యుత్ అద్యక్షులు మూరుకుట్ల నరేందర్, జిల్లా యుత్ కార్యదర్శి కర్రి నాగేంద్రబాబు, చీమల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: