మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం పోశం నరసింహారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సకిని రామ చంద్రయ్య కు పద్మశ్రీ రావడం తెలంగాణకు,ఆదివాసి సమాజానికి దక్కిన గౌరవమని హర్షం వ్యక్తం చేశారు.సకిని రామ చంద్రయ్య అవార్డుకు ఎంపికైన కల రూపంతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చారని ప్రశంసించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య అంతరించిపోతున్న ఆదివాసి కళ *కంచు తాళం కంచు మేళం* గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని పొందడం జరిగింది.ఈ పురస్కారంతో ఆదివాసి జాతి మొత్తాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత రామచంద్రయ్య కే దక్కుతుంది అన్నారు. ఇటీవలనే తెలంగాణ ప్రగతి భవన్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని.రామచంద్రయ్య ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర రావు సన్మానించారు.రామచంద్రయ్య కి తెలంగాణ సీఎం కేసీఆర్,కోటి రూపాయల ను,సొంత జిల్లాలో గృహనిర్మాణం కు నివాస స్థలాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చొరవతో,సొంత జిల్లాలోనే ఇంటి నిర్మాణం జరుగనుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అడపా.అప్పారావు, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లు రాడిమి. రామిరెడ్డి,బొలిశెట్టి నవీన్, ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,సర్పంచ్ ఏనీక ప్రసాద్, మణుగూరు టౌన్ యూత్ ప్రెసిడెంట్ రుద్ర వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: