టేకులపల్లి ఫిబ్రవరి13 (మన్యం మనుగడ)
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఎఐటియుసి ఆద్వర్యంలో ఉదయం షిఫ్ట్ నందుకొయగూడెం ఓసి కార్మికులు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని పిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తొలుత ఇంచార్జి మేనేజర్ టిఎస్ఎన్ రాజు కు సమస్యలతొ కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి ఎండి.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి లొ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించడంలొ గుర్తింపు సంఘం విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి నాలుగు బ్లాకులను వేలం వేయడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. నాలుగు బ్లాకులను సింగరేణి కె కెటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. పెరెక్స్ పై పడుతున్న ఇంకంటాక్స్ ను కంపెనీ కోలిండియా మాదిరిగా రీఅంబర్స్మేంట్ కార్మికుల కు చెల్లించాలి.61 సంవత్సరాల సర్వీస్ పెంచిన కార్మికుల కు సిఎంపిఎఫ్,పెన్షన్ కల్పించాలని. మారుపేర్లను పరిష్కరించాలని. ఏదైనా ఆనారోగ్యంతో అన్ ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, టేక్నికల్ స్టాఫ్, ఈపి ఆపరేటర్ లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని. డిపెండెంట్ వయస్సు35 సంవత్సరాల నుంచి40 సంవత్సరాలు పెంచాలని. అంతర్గత అభ్యర్థుల చె క్లరికల్ ,పారమేడికల్ ఖాళీ లను భర్తీ చేయాలని. నూతన భూగర్భ గనులను ప్రారంబించి నీరుద్యొగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. గోదావరిఖని లొ నూతన ప్రభుత్వ వైద్య కళాశాలొ సింగరేణి కార్మికుల పిల్లలకు 50% సీట్లు కేటాయించాలని, అందులొ నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీ లను సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
కల్పించాలని నజీర్ యాజమాన్యం ను డిమాండ్ చెశారు ఈ ధర్నా కార్యక్రమంలో టిజేఎస్ జిల్లా ఉపాద్యక్షులు గుగులొత్ కృష్ణ, ఫిట్ సహాయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు,జిఎ.శ్రీనివాస్, బాలాజీ, లక్షమ్మయ్య,సర్వర్, షబ్బీర్,జోగారావు, భావ్ సింగ్, మోహన్,బండి సీతారాముల, సమ్మయ్య,ఇంతియాజ్,హూసేన్ పాషా, ఖయ్యూం,ఉపేందర్, అహ్మద్,ఎన్ వీ రావు,ఖాదర్, పునంమ్ ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: