మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గానికి ఎప్పుడో కేటాయించిన ఎస్టీ గిరిజన మహిళ డిగ్రీ కళాశాలను సరైన వసతులు లేక ఖమ్మం జిల్లాలోని తనికెళ్ళలో ప్రస్తుతం నడుస్తుందని తెలవడంతో మన అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి వెంటనే ఎమ్మెల్యే మెచ్చాకి, ఎంపీ నామ నాగేశ్వరరావుకి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి తెలియజేయటం, అలాగె ఐటీడిఏ పిఓకి వినతి పత్రాన్ని అందజేశారు. కానీ అశ్వారావుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నూతన బిల్డింగ్ కావాల్సి వస్తుంది కనుక నూతన బిల్డింగ్ కేటాయించే వరకు మండలంలోని సున్నం బట్టీ, బచ్చువారిగుడెం గ్రామంలో గల గిరిజన పాఠశాలల లో తాత్కాలికంగా నడపడానికి అయా గ్రామాలలో వున్న గిరిజన పాటశాలలోని గదులను పరిశీలించి విద్యార్థులు కాలేజ్ కివెళ్లేందుకు ఎక్కడ అవితే రవాణాకు వీలుగా వుంటుందో అనీ పరిసరాలను మొత్తం ఐటీడిఏ పిఓ పరిశీలించి వెళ్ళడం జరిగింది. త్వరలోనే అశ్వారావుపేట మండలంలో ఎస్టీ గిరిజన మహిళ డిగ్రీ కాలేజీ అందుబాటులో వుంటుందని ఐటీడిఏ పిఓ గౌతమ్ ఎంపీపీతో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచ్ లు సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: