- అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి విద్యార్థుల నుండి పలు సమస్యలు తెలుసుకున్న ఎంపీపీ రేగా
మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామ పంచాయితిలో చిలకల గుంపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీపీ కాళిక సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం విద్యార్థులకు అందుతున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి అంగన్వాడి టీచర్ ని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం గురించి అడగగా గత రెండు నెలల నుండి కోడిగుడ్లు రావటం లేదని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించి సిడిపిఓ కి
చరవాణిలో సమాచారం చేరవేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి టీచర్ మా పాఠశాలలో త్రాగునీటి సమస్య ఉందని ఎంపిపి కి తెలుపగా ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల సోమయ్య రేగా సత్యనారాయణ కొమరం.సురేష్ జవ్వజి సమ్మయ్య పాల్గొన్నారు.
Post A Comment: