గుండాల ఫిబ్రవరి 2 (మన్యం మనుగడ) మండలంలో గంజాయి పండించిన విక్రయించిన పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని గుండాల సీఐ కరుణాకర్ అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మండల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, గుట్కా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు మండలంలోని యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని ఆయన సూచించారు గంజాయి , గుట్కా లాంటి చెడు అలవాట్లకు బానిస ఐతే భవిష్యత్తు అంధకారమే అన్నారు. త్వరలోనే మండలాల్లో గంజాయి, గుట్కా వ్యాపారాలు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులు సైతం అలాంటి వారిని గుర్తించి మానేస్తే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ సంధాని, సర్పంచులు సీతారాములు, ముత్యమా చారి, సమ్మయ్య , మోహన్
Post A Comment: