CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ ఆర్కిటెక్ట్ ఎవ‌రో తెలుసా..? కేసీఆర్ అభినంద‌లు.

Share it:

 


 

జ‌న‌గామ : జ‌న‌గామ నూత‌న‌ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఆ భ‌వ‌న స‌ముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారులకు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప‌రిచ‌యం చేశారు. ఆర్కిటెక్ట్‌తో పాటు భ‌వ‌నాన్ని నిర్మించిన ఈఎన్సీని కూడా ప‌రిచ‌యం చేసి కంగ్రాట్స్ చెప్పారు.


ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం క‌ట్టింది కూడా మ‌న తెలంగాణ బిడ్డ‌నే. తెలంగాణ‌కు తెలివే లేదు. బిల్డింగ్‌లు క‌ట్టుకోవ‌డానికి రానే రాదు. పరిపాల‌న చేయ‌డం చేత‌కాద‌ని స‌మైక్య‌వాదులు అన్నారు. జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ బిల్డింగ్ న‌మూనాను రూపొందించింది ఆర్కిటెక్ట్ ఉషారెడ్డినే. ఈమె యాద‌గిరిగుట్ట‌కు చెందిన మ‌హిళ అని కేసీఆర్ ప్ర‌శంసించారు. మ‌న ఆడ‌బిడ్డ అయినందుకు గ‌ర్విస్తున్నాను.. ఆమెకు శుభాకాంక్ష‌లు. ఈ బిల్డింగ్‌ను వెంబ‌డి ఉండి క‌ట్టించింది కూడా మ‌న ఈఎన్సీ గ‌ణ‌ప‌తి రెడ్డినే. వారిది మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌.. ఆయ‌న తెలంగాణ బిడ్డ‌నే.


ఇలా అనేక మంది మ‌న బిడ్డ‌లే, ఆర్కిటెక్టులే భ‌వ‌నాల‌ను క‌ట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వారిని ప్రోత్స‌హించి అద్భుతాలు చేయిస్తున్నారు. ప‌విత్ర‌మైన దేవాల‌యం లాంటి ఈ క‌లెక్ట‌రేట్ నుంచే అనేక ప‌నులు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. ఒక స‌మ‌న్వ‌యంతో క‌లెక్ట‌ర్ నాయ‌క‌త్వంలో ప్రజాప్ర‌తినిధుల స‌హ‌కారంతో జ‌న‌గామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్క‌రించాలి అని కేసీఆర్ అన్నారు.

Share it:

TS

Post A Comment: