గుండాల/ ఆళ్లపల్లి ఫిబ్రవరి 1 (మన్యం మనుగడ) ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యా రాకతో విద్యావ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జడ్ పి టి సి కొమరం హనుమంతరావు అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్వాగతం పలికి బెలూన్ ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. దీనికితోడు ఆంగ్ల విద్య ప్రవేశ పెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అన్నారు. ఆంగ్ల విద్య ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: