గుండాల/ ఆళ్ల పల్లి ఫిబ్రవరి 4 (మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఆహ్వానం పలికేందుకు పార్టీ శ్రేణులు కదలిరావాలని ఆళ్ల పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాయం. నరసింహారావు, షేక్. బాబా ప్రత్యేక ఆహ్వానం తలిచారు మండలంలోని ప్రజా ప్రతినిధులు , నామినేటెడ్ సభ్యులు,పార్టీ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యటన ముగించుకుని మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని వారు తెలిపారు
Post A Comment: