CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

అశ్వారావుపేట మండలం, నారాయణపురం గ్రామంలో వెంచేసి వున్నా శ్రీశ్రీ కట్టమైసమ్మ అమ్మ వారి 11వ వార్షికోత్సవ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమయానికి వర్షాలు పడి రైతులు వేసిన పంటలు సస్యశ్యామలంగా పండాలని, అలాగే అమ్మవారి దయ వల్ల ఈ కరోనా మహమ్మారి ఇంతటితో పోయి ఈ సంవత్సరం అన్నీ జాతరలు జరగాలని అలాగే మన భద్రాచలం సీత రామచంద్ర స్వామీ వారీ కళ్యాణం ప్రజల మధ్యనే జరుగుతుందని, ప్రతి పండగను ఆనందంగా చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే మండల ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి .శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, మోహన్ రెడ్డి, కంగాల పరమేష్, నిర్మల పుల్లారావు, బిర్రం వెంకటేశ్వరరావు, చిన్నంసెట్టి వెంకట నరసింహ, నులకా శ్రీను, కాసాని వెంకటేశ్వరరావు, జుజ్జురి వెంకన్న బాబు, వెంకటేశ్వరరావు, చందు, వేణు గోపాల్, ఆకుల శ్రీను, నారం రాజశేఖర్, పసుపులేటి కొండయ్య, ఆకుల నాగేశ్వరరావు, నారదాసి రామారావు, మల్లేశ్వర రావు, నాగేంద్ర, చందు, ముసలయ్య తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: