మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని తోగ్గూడెం గ్రామానికి చెందిన కోరం పాపయ్య (85) అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం 50 కేజీల బియ్యం, సర్పంచ్ కల్తీ శ్రీలత 25 కేజీల బియ్యం ను మృతుని కుటుంబ సభ్యులకు , దశదిన ఖర్మ ల నిమిత్తం సహాయంగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేశాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గోగ్గల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కల్తీ లక్ష్మయ్య , జనగం సంజీవ , వల్లెపు సంపత్ ,పాయం వెంకటేశ్వర్లు, కోరం కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: