CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.

Share it:

 


  • అంబేద్కర్ ను అవమానిస్తారా.
  • రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అంటారా.
  • అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు.
  • ముందు ఇది గ్రహించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్.
  • ఏటూరు నాగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 
  • చిటమట రఘు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశ ద్రోహ కేసు పెట్టాలని,ప్రపంచమంతా కీర్తించే రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అవమానిస్తారా అని ఏటూర్ నాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ప్రజలు,విద్యార్థులు, ఉద్యోగులు,కార్మికులు, కర్షకులు,ప్రజా సంఘాల నాయకులు,మేధావులు గ్రహిస్తున్నారని సమయాన్ని బట్టి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ముఖ్యమంత్రి సార్ కళ్ళు తాగిన కోతి గంతులు వేసినట్లు మాటలు మాట్లాడు తున్నారని అన్నారు. బుధవారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏటూరునాగారం లో బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు.లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టి 24 గంటల కరెంటు ఇచ్చి వరి పంట పండించే వద్దు అని అనడం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,మండల నాయకులు ముక్కెర లాలయ్య,పడిదల హను మంతు,సమ్మక్క,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కర్నె సత్యం,నేగరి కంటి ముఖేష్, గద్దల నవీన్,రాంబాబు,ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: