మన్యంటీవి, అశ్వారావుపేట: ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&,పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు, అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు ఆదేశాల మేరకు మొదటిరోజు అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దిబ్బగూడెం గ్రామం లో అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో వృద్దులకు, స్కూల్ పిల్లలకు, అంగన్వాడి స్కూల్ పిల్లలకు పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ స్ పార్టీ గ్రామ కమిటీ విద్యార్థి విభాగం కార్యదర్శి నరసింహరావు, టిఆర్ స్ పార్టీ కార్యకర్తలు, యువత రాముడు, దుర్గారావు, కణితి రాజు, సుధాకర్, కిషోర్, ముత్యాలరావు, పాపారావు, వృద్ధులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: