CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్ధిక అక్షరాస్యత ద్వారా ఆర్థిక క్రమ శిక్షణతో ఆర్ధిక అభివృద్ధి సాధించవచ్చు : లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు.

Share it:

 



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి 18 శుక్రవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఆర్ధిక అక్షరాస్యత ద్వారా ఆర్థిక క్రమ శిక్షణతో ఆర్ధిక అభివృద్ధి సాధించవచ్చని ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యమని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం దమ్మపేట పట్టణం రైతు వేదికలో స్టేక్ హెూల్డర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలు ఆర్థికంగా ఎలా మెరుగు పడాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ అధ్వర్యంలో అన్ని రకాల బ్యాంక్ లను అనుసంధానం చేసుకుంటూ పేస్ స్వచ్చంద సంస్థ ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కోసం సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (సీఎఫ్ఎల్) సెంటర్లను ఏర్పాటు చేసిందని దమ్మపేట సీఎఫ్ఎల్ పరిధిలో దమ్మపేట అశ్వారావుపేట అన్నపరెడ్డిపల్లి మండలాలు ఉన్నాయని తెలిపారు ఈ సెంటర్ వాళ్లు నిర్వహించే అవగాహన సదస్సుకు ప్రజాప్రతినిధులు పంచాయతీ అధికారులు మండల సమాఖ్య సిబ్బంది సహకరించాలని కోరారు తద్వారా ప్రజలకు బ్యాంకు సేవలు మరింత చేరువ అవుతాయని గ్రామంలో ప్రజలు సైబర్ క్రైమ్ నేరాలు జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి అని పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు దమ్మపేట ఎపీఎం నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ విధంగా అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ వారు మంచి కార్యక్రమం చేపట్టారని పేస్ స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించే ఈ కార్యక్రమం అధికారికంగా చేయడం కోసమే ఈ మీటింగ్ అని ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము మాతో పాటు మా సిబ్బంది కూడా పాల్పంచుకుంటామని అన్నారు కార్యక్రమాలకు తాము కూడా హాజరవుతామని తెలిపారు వివిధ బ్యాంకు మేనేజర్స్ మాట్లాడుతూ ఆర్బీఐ వాళ్ళు చేపట్టిన మంచి కార్యక్రమంను విజయవంతం చేయడానికి తమ బ్యాంకుల తరుపున కూడా పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ మండలాల మండల సమాఖ్య విఓఎ లు మాట్లాడుతూ అధికారులు అందరం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి అంజి బాబు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ చంటి బ్యాంకు మేనేజర్లు పట్వారిగూడెం ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ దినేష్ కుమార్ వడ్లగూడెం యుబిఐ బ్యాంకు మేనేజర్ జీవన్ కుమార్ నాగుపెళ్లి యుబిఐ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర వినాయకపురం యుబిఐ బ్యాంక్ మేనేజర్ కృష్ణ వివిధ గ్రామాల గ్రామ దీపికలు సర్పంచులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: