చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఇకపై పంచాయితీ వాహనం ద్వారా రేషన్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రానికి తరలించడం జరుగుతుందని సిడిపిఓ నిర్మల జ్యోతి అన్నారు.మంగళవారం టేకులబంజార, వెంగళరావు కాలనీ, తుంగారం పంచాయతీల్లో అంగన్వాడి కేంద్రాలను ఆమె సందర్శించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చండ్రుగొండ మండలంలో పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ బియ్యం సరఫరాను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఇకపై ట్రాక్టర్ల ద్వారా బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అన్నపూర్ణ సూపర్వైజర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: