- బ్రిడ్జిల నిర్మాణం పనుల వద్ద హెచ్చరిక సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఎఎంసీ వైస్ చైర్మెన్ కొమరం రాంబాబు
మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని శ్రీ రంగపురం -చొప్పాల,గొల్లగూడెం-చిలకలసింగారం,మోతె- బర్లగూడెం గ్రామాల మధ్యలో గల వాగుల పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను కరకగూడెం ఎంపీపీ రేగ కాళిక బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పిఎమ్ జి ఎస్ వై నిధుల ద్వార చెపడుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలని అన్నారు. అలాగే మండల పరిధిలోని నిర్మిస్తున్న మూడు బ్రిడ్జి పనుల వద్ద హెచ్చరిక సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. అలాగే వట్టి వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల వద్ద ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ కి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జవ్వాజి రాధ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ జవ్వాజి సమ్మయ్య కొమరం,సురేష్, గోగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Post A Comment: