CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సేల్ ఫర్ ఇండియా.కేంద్ర బడ్జెట్ లో తేటతెల్లం.ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి జలాల్ మహమ్మద్.

Share it:


మన్యం వెబ్ న్యూస్:

అత్యంత గొప్పగా 39 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెట్టే విధంగా ఉందని ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి జలాల్ మొహమ్మద్ ఆరోపించారు తెలంగాణలో యువతకు ఉపాధి బయ్యారం ఉక్కు పరిశ్రమ సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు పరిశ్రమకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హాస్యాస్పదం అని అన్నారు కేంద్ర ప్రభుత్వ రంగ శాఖలలో ఇప్పటికే పదహారు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేయడానికి చేతులు రాని ప్రభుత్వం మరోసారి 60 వేల లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి యువతను మోసం చేయబోతుంది విద్యారంగానికి అత్యంత తక్కువ 9.7 శాతం కేటాయించి ఎంత వేగంగా విద్యను నిర్వీర్యం చేయాలో తేటతెల్లం చేసింది ఎయిర్ ఇండియా రైల్వే లైన్లు జాతీయ రహదారులు బ్యాంకింగ్ వ్యవస్థ పోస్టల్ వ్యవస్థతోపాటు ఉ పేదలకు కల్పతరువుగా ఉన్న ఎల్ఐసి ని సైతం అమ్మడానికి పరుగులు పెడుతుంది నిరుద్యోగ యువతకు ఎం ఎస్ ఎంఈ ముద్ర లోన్ ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ నిధులను కేటాయించినట్లు కేటాయించి పక్కదారి ఇస్తుండడం చూస్తే నిరుద్యోగ వ్యవస్థను ఏవిధంగా పెంచి పోషిస్తున్న దో మనకు అర్థమవుతుంది ఇక మైనార్టీల సంక్షేమం అయితే పూర్తిగా గాలికి వదిలేసిన కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అన్నమో రామచంద్ర గా మార్చబడుతుంది సేల్ ఫర్ ఇండియా గా అమ్మకానికి భారతదేశం ఏ విధంగా సంకేతాలను తీసుకెళ్తూ తూ గంపగుత్తగా అమ్మకానికి పెట్టడాన్ని అన్ని వర్గాల ప్రజలు యువత తీవ్రంగా ఖండించాలని పోరాటాలు ఉధృతం చేయాలని ఆయన అన్నారు.

Share it:

TS

Post A Comment: