మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగా అవకాశాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రాష్ట్ర పాలకులు పరిష్కారం చూపడంలో వైఫల్యం చెందారని, ఏఐవైఎఫ్ భద్రాద్రి జిల్లా సమితి సభ్యులు ఎస్కే సమీర్ అన్నారు. శుక్రవారం జూలూరుపాడు లో ఏఐవైఎఫ్ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 1, 91, 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి అంటూ అనేక హామీలను ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక రాక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు కోటే నరేష్, అనుముల అశోక్, గార్లపాటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: