CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అల్లం పద్మకు 'మావోయిస్టు పార్టీ సంతాపం.మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర లేఖ విడుదల.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో భాద పడుతూ ఫిబ్రవరి 22 వ తేదిన తుది విడిచిన అల్లం పద్మకు మా పార్టీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నది . ప్రజా స్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ తన వంతు భాద్యత వహించింది . ప్రజా స్వామిక తెలంగాణ కోసం ఎంతో పరితపించి శక్తి వంచన లేకుండా శ్రమించింది . పోరాడుతున్న ఉద్యమకారులుకు మద్దతునందించి స్ఫూర్తిని , ధైర్యాన్ని నింపింది . తాను ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమకారులు ఉత్సహాంగా విరోచితంగా పోరాడారు . విరామం ఎరుగక పోరాడిన పోరాట శ్రేణులకు అలసట లేకుండా ఎంతో ఓపికతో భోజనాలు ఏర్పాటు చేసి ఎన్నో సేవలందించింది . అందరికి అప్యాయతలు పంచిన అల్లం పద్మ తెలంగాణ అమ్మగా గుర్తింపు పొందింది . తల్లి పాత్ర పోషించి , స్ఫూర్తిని నింపిన అల్లం పద్మను తెలంగాణ సమాజం , ముఖ్యంగా ప్రజా స్వామిక తెలంగాణ నినాదంతో పోరాడిన ఉద్యమ శక్తులు ఎన్నటికీ మరిచి పోవు . అల్లం పద్మ మరణం మా పార్టీని తీవ్రంగా కలతకు , భాధకు గురి చేసింది . అందరిలో ఎంతో గుర్తింపున పొందిన పద్మ భౌతికంగా తెలంగాణ సమాజంలో లేదనడానికి చింతిస్తున్నాం . అల్లం పద్మకు మా పార్టి సంతాపాన్ని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: