మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల దళిత మోర్చా అధ్యక్షులు దుర్గం నరసింహారావు ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా బిజెపి పార్టీ దళిత మోర్చా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో డిగ్రీలు పీజీ పట్టాలు పొంది ఉద్యోగాలు రాక, అటు పని చేయలేని స్థితిలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఎంతోమంది మరణించారని తెలంగాణలో కెసిఆర్ పరిపాలన అస్త వ్యస్తంగా సాగుతుంది ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టి కేసులు పెట్టడం జరుగుతుందని ఇకనైనా కెసిఆర్ కళ్ళు తెరిచి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని లేని పక్షంలో బిజెపి పార్టీ తరపున రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు కావేరి నారాయణ దళిత మోర్చా మండల కోశాధికారి గాంధేర్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: