మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలంలోని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సమాఖ్య ములుగు పండర్ పూర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి చిన్నా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సి కమిటీ నివేదిక ప్రకారం ఒక లక్షా తొంభై వేల 126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వెంటనే వాటికి నోటిఫికేషన్లు విడుదల చేసి, భర్తీ చేయాలని అలాగే స్థానికంగా కమలాపురం లో ఉన్న బిల్ట్ కర్మాగారాన్ని ఓపెనింగ్ చేసి ఇ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర నలుమూలల ఎక్కడ చూసినా నిరుద్యోగులు ఆత్మహత్య లు కనపడుతున్నాయని దీనిపై ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యువత ఎవరు కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యమాలు చేసి సాధించుకోవాలని ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించిన నిరుద్యోగ భృతి విధి విధానాలు ప్రకటించలేదని వెంటనే విడుదల చేసి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో బస్ డిపో ఏర్పాటు చేయాలని అన్నారు లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో నాయకులు రమేష్ సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: