మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని,నిరుద్యోగ భృతి ని ప్రారంభించాలని,ఏటూరు నాగారం తహశీల్దార్ కార్యా లయంలో బుధవారం తాసిల్దార్ రవీందర్ కు వినతిపత్రం
అందజేశారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్నా మాట్లాడుతూ.(నిన్న) మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని అధికారంలోకి రాకముందు మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ లక్ష ఉద్యో గాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసింద ని వారు విమర్శించారు.ప్రభు త్వరంగ సంస్థలను బలోపేతం చేయకుండా బడా కార్పొరేట్ యాజమాన్యాలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం యువత హక్కులను కాలరాస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్ఎన్ఎల్,ఎల్ఐసి,పోస్ట్ ఆఫీస్,రైల్వే ప్రభుత్వరంగ సంస్థలను కూడా కేంద్ర ప్రభు త్వం తాకట్టు పెట్టాలని చూస్తుం దని వారు అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీ ఉద్యో గాలు ఉన్నాయని తెలిసి కూడా రానున్న ఐదు సంవత్సరాల కాలంలో 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్ల మెంట్లో చెప్పడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. దేశంలో ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ యువత ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని, తెలిసికూడా బండి సంజయ్ ఉద్యోగ కల్పన గురించి మాట్లా డకపోవడం యువత మీద ఇంత నిర్లక్ష్యం ఉందో అర్థమ వుతోందని వారుఅన్నారు.
రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపించ కపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత ఆందో ళన కార్యక్ర మాలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వారు హెచ్చరించారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,90,126 ఉద్యో గాలకు నోటిఫి కేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ములుగు జిల్లా లో గిరిజన యూనివర్సిటీని త్వరగా పూర్తి చేసి ప్రారంభిం చాలని అన్నారు,ఈ కార్యక్ర మంలో డివైఎఫ్ఐ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి నరేష్,డివైఎఫ్ఐ ఏటూరు నాగారం మండల నాయకులు వడ్డే నరేష్,రొక్కల విష్ణు,శివ శంకర్,మామిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: