CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాహనదారుల కొరకు ప్రమాద సూచికల ఏర్పాటు.మేడారం జాతర దృష్ట్యా, వాహనదారుల కొరకు ఏర్పాటు.

Share it:

 




  • దగ్గరుండి పనులను పర్యవేక్షించిన ఏడూళ్ల బయ్యారం ఎస్ ఐ టి వి ఆర్ సూరి


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో, మేడారం జాతర దృష్ట్యా రహదారి వెంబడి ప్రమాద నియంత్రిక సూచికలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏడూళ్ల బయ్యారం ఎస్ ఐ టి వి ఆర్ సూరి మాట్లాడుతూ, జాతర దృష్ట్యా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, మూల మలుపుల వద్ద రహదారి అవగాహన లేకుండా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు అనే ఉద్దేశంతో, ఈ ప్రమాద సూచికలు ఏర్పాటు చేశామని, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రమాద సూచికలు ఉపయోగపడతాయని, దానికి అనుగుణంగా వాహన దారులు నడుచుకోవాలని తెలియజేశారు. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ నుండి ములుగు జిల్లా సరిహద్దు బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వరకు ఈ ప్రమాద సూచికలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి నడపడం చాలా ప్రమాదమని, ఈ విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి అని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: