మన్యం మనుగడ:
కలవాహిని సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో 13-2-22 వ తారీకున రాత్రి భద్రాచలం రెడ్డి సత్రం లో జరిగిన డాన్స్ ఫెస్టివల్ 2022 కార్యక్రమం లో భద్రాచలం లో ని కూచిపూడి గురువులు చల్ల కొండలరావు, జయమాధురి, భాగ్యశ్రీ గురువులు వారి శిష్యులతో చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి ఈ కార్యక్రమాలలో భాగంగా గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీ బోగాల శ్రీనివాస రెడ్డి చిన్నారులకు బహుమతులు అందజేసారు. అంతరించి పోతున్న ఈ కళాలకి ప్రాణం పోస్తున్న డాన్స్ మాస్టర్ శ్రీ కొండలరావు ని అభినందించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో TRS నాయకులు డాక్టర్ శ్రీ తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసింహా రావు, గ్రీన్ భద్రాద్రి సెక్రటరీ శ్రీ పామరాజు తిరుమల రావు, కోశాధికారి శ్రీ ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, కడాలి నాగరాజు, రాచమల్ల రాము, శ్రీ కృష్ణమోహన్, మ్యూజిక్ టీచర్ వాణి రామ్ గారు పాల్గొన్నారు. చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: