మన్యం టీవి న్యూస్,మణుగూరు: సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు బలవంతంగా దురాక్రమణకు పాల్పడటాన్ని ఆపాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి డిమాండ్ చేశారు. గురువారం డి పున్నం చందర్ అధ్యక్షతన కృష్ణ సాగర్ పంచాయతీ ఊర్ల దోసపాడు ఆదివాసుల తో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మోర రవి మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ తో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తోపాటు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాన్ని వెనక్కి కొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం, పోడు భూములకు పట్టాలు ఇస్తామని, దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించి, ఫారెస్టు అధికారులను ఉసిగొలిపి, సాగులో ఉన్న భూములను బలవంతంగా గుంజుకుని, ట్రoచి లు తీస్తున్నారని అన్నారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, పోడు భూములు కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే, ఉద్యమాలతో చెత్త బుట్టలో పడ వేస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఫారెస్ట్ వారి దాడులను ఆపివేసి, ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి పున్నం చందర్, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు బండ్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, వైయస్ రెడ్డి, బర్ల రామకృష్ణ , భద్రయ్య, ఇడమయ్య , రాజు , సోమయ్య , గంగరాజు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: